టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేస్తున్న ప్రముఖ వివాదాస్పద నటి శ్రీరెడ్డి ప్రస్తుతం వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టులు చేశారు.ఈ సందర్భంగా శ్రీరెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ను సంభోదిస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద ..అయన తనయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అందరికి అభిమానం గౌరవం ఉంటుంది .ఓదార్పు యాత్ర ఒక్కటి చాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ..అయన వ్యక్తిత్వం ఎంతో మంచిది ..దాన్ని నిరూపించడానికి ఆయన చేస్తున్న పాదయాత్ర ..రాజకీయాల పట్ల వ్యవహరిస్తున్న తీరే ఉదాహరణ అని ఆమె అన్నారు .ఆమె ఇంకా ఏమి అన్నారో కింది ట్వీట్ లో మీరే ఒక లుక్ వేయండి ..
జగన్ అన్న రౌడీ రాజకీయాలు చేసే వాళ్ళని మీలో కలుపుకోవద్దు, రాజశేఖర్ రెడ్డి గారు అన్నా మీరు అన్నా జనంలో విపరీతమైన అభిమానం ఉంది, మీరు చేసిన ఓదార్పు యాత్ర ఒక్కటి చాలు మీ మంచితనాన్ని తెలపటానికి, శాంతి ,ఓర్పు, సహనం జగన్ అన్న ఆయుదాలు, యువతకి ఆదర్శ మూర్తి మన జగన్ అన్న#srireddy #ysjagan
— Sri Reddy (@MsSriReddy) April 22, 2018