Home / ANDHRAPRADESH / జగన్ పాదయాత్రను సైడ్ ట్రాక్ పట్టించడానికి భారీ కుట్ర ..!

జగన్ పాదయాత్రను సైడ్ ట్రాక్ పట్టించడానికి భారీ కుట్ర ..!

ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ప్రత్యేక హోదా .మరొకటి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేస్తున్న పాదయాత్ర .మొదటిది ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును మార్చే ముఖ్యాంశం అయితే రెండోది గత నాలుగు ఏండ్లుగా టీడీపీ సర్కారు అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తూ ..గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన ఆరు వందల ఎన్నికల హామీలలో ఒక్కటి కూడా నేరవేర్చపోవడమే కాకుండా విభజన చట్టంలోని హామీలను సాధించడంలో విఫలమైన టీడీపీ చేతకాని తనం మీద చేస్తున్న పోరాటంలో భాగంగా జగన్ చేస్తున్న పాదయాత్ర .అయితే ఇంతటి మహోత్తర కారణాలు ఉన్న ఈ రెండు అంశాలను దారి పట్టించడానికి ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భారీ కుట్రకు తెరలేపారా..

గత నూట నలబై రెండు రోజులుగా జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి వస్తున్నా విశేష ఆదరణను చూసి తట్టుకోలేక బాబు ఈ కుయుక్తులకు పాల్పడ్డారా ..ప్రత్యేక హోదా కోసం గత నాలుగు ఏండ్లుగా పోరాటం చేయడమే కాకుండా ఏకంగా తమ పార్టీకి చెందిన లోక్ సభ సభ్యుల చేత రాజీనామా చేయించి ప్రత్యేక హోదా పోరులో మరో అడుగు వేశారు జగన్ .జగన్ చేస్తున్న పాదయాత్ర వలన ..ప్రత్యేక హోదా వస్తే ఆ క్రెడిట్ వైసీపీ పార్టీకి ఎక్కడ దక్కుతుందో అని దాన్ని సైడ్ ట్రాక్ పట్టించడానికి ప్రముఖ నటి శ్రీరెడ్డి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు అని ఇటు సినీ అటు రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు.అందులో భాగంగా చంద్రబాబు ఏకంగా పది కోట్ల రూపాయలను డీల్ (పవన్ ఆరోపిస్తున్నట్లుగా )ఒప్పందం చేస్కొని పవన్ కళ్యాణ్ మీద రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత విమర్శలు చేయమని శ్రీరెడ్డిను ఉసిగొల్పారు అని ఇండస్ట్రీ రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ శ్రీరెడ్డి అంశం గురించి మీడియాతో మాట్లాడుతూ మీకు అన్యాయం జరిగితే న్యాయస్థానాలు ఉన్నాయి ..పోలీసులు ఉన్నారు .వాళ్ళ దగ్గర చెప్పండి .మీకు న్యాయం జరగక్కపోతే నన్ను సంప్రదించమని పవన్ సలహా ఇచ్చాడు .అయితే శ్రీరెడ్డి మీడియాతోమాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి రాజకీయ విమర్సలు చేయకుండా ఏకంగా పవన్ తల్లి గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.పవన్ పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలో ఏ సమస్య లేనట్లు బాబు ఆస్థాన మీడియాగా ముద్రపడిన పవన్ కళ్యాణ్ పేర్లు చెప్పిన కొన్ని మీడియా ఛానల్స్ ఉదయం ,రాత్రి అనక స్పెషల్ ప్రోగ్రామ్స్ వేసి మరి డిబేట్లు పెట్టారు .అయితే మీడియా అంటే తమకు రేటింగ్ కావాలని భావించే ప్రస్తుత రోజులల్లో ఏపీకి స్పెషల్ స్టేటస్ కావాలని ప్రత్యేక చర్చ కార్యక్రమాలు పెట్టకుండా ..జగన్ చేస్తున్న పాదయాత్రను లైవ్ కవరైజ్ ఇవ్వకుండా కేవలం శ్రీరెడ్డి అంశాన్నే మీడియా హైలెట్ చేసింది.

అయితే శ్రీరెడ్డి తీసుకొచ్చిన అంశం సాధారణమైంది కాదు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ ఏపీ ప్రజలకు చాలా అవసరం .ఎందుకంటే ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉంది .ఈ ఏడాదిలోనే కొట్లాడో పోరాడో తెచ్చుకోవాలి .అందుకు లోకల్ ఏపీలో జరుగుతున్న పరిణామాలు జాతీయ స్థాయిలో హైలెట్ అవ్వాలంటే మీడియా కవరైజ్ కావాలి .ఇలాంటి సమయంలో ఇండస్ట్రీలో ఎప్పటి నుండో వ్రేళ్ళు పెనవేసుకొని ఉన్న క్యాస్టింగ్ కౌచ్ అంశాన్ని ముందు వేసుకొని స్పెషల్ స్టేటస్ కోసం ఇటు ఏపీ ప్రజలు రోడ్లపైకి వచ్చి ..అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు వైసీపీ తో సహా పలు పార్టీలు కోట్లడుతున్న తీరును ఏపీ ప్రజలకు తెలియకుండా ఢిల్లీకు చేరకుండా కేవలం శ్రీరెడ్డి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి పవన్ ను వ్యక్తిగతంగా దాడులు నిర్వహించి మానసికంగా కృంగదీయాలనే లక్ష్యంతో ఇలా చేశారు అని రాజకీయ సినీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

శ్రీరెడ్డి ఆధారాలు ఉంటె పోలీసులకు కానీ ప్రభుత్వానికి కానీ హ్యాండ్ ఓవర్ చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు .ఇంత చిన్న లాజిక్ మరిచిపోయి జగన్ పాదయాత్రను ,స్పెషల్ స్టేటస్ అంశాన్ని పక్క తోవ పట్టించడానికే బాబు ఇలా చేస్తున్నాడు అని కూడా రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు.అయిన ప్రజల గుండెల్లో నెలవై ఉన్న స్పెషల్ స్టేటస్ పోరాటాన్ని జగన్ పాదయాత్రను చెరిపి వేయాలని ఎన్ని కుట్రలు చేస్తే ఏమి ఉపయోగం అని కూడా రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat