టివీ 9,ABNలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వార్ కొనసాగుతుంది.ఇవాళ కొద్దిసేపటి క్రితం .ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ పై పవన్ సంచలన ట్వీట్ చేశారు. ” ఆర్కే నువ్వు నడిపే పేపర్ పేరు ఆంరజ్యోతా? లేక టీడీపీజ్యోతా? ఎందుకంటే అది ఆంధ్రులకు సంబంధించినదైతే కాదు. ఇలా ఎందుకంటున్నారో వచ్చే కొద్ది వారాల్లో స్పష్టత వస్తుంది” అంటూ పవన్ సంచలన ట్వీట్ చేశాడు.
Welcome back to #BMBK program with PawanKalan ..Today our guest is Mr. RK who is MD of ?? ఆర్కే , నువ్వు నడిపే పేపర్ పేరు ఆంరజ్యోతా ? టీడీపీజ్యోతా ? ఎందుకంటే అది ఆంధ్రులకి సంబందించింది ఐతే కాదు .. అసలు ఎందుకంటున్నారో ఈ మాట అనేది వచ్చే కొద్దీర్ వారాల్లో ఒక స్పష్టత వస్తుంది..
— Pawan Kalyan (@PawanKalyan) April 22, 2018
మరో ట్వీట్ లో టీవీ9 అధినేత రవిప్రకాశ్ ను ఉద్దేశిస్తూ పవన్ ట్వీట్ చేశారు. టీవీ9 రవిప్రకాశ్ కు సంబంధించి మా గ్రౌండ్ స్టాఫ్ ఇచ్చిన లేటెస్ట్ అప్ డేట్ ఇది అంటూ మెసేజ్ పెట్టారు. ‘టీవీ9 సీఈవో రవిప్రకాశ్ పై చెప్పుతో దాడి’ పేరుతో ఓ పేపర్లో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేశారు.
A fresh update from our ground staff on Ravi of TV9 pic.twitter.com/RW0qFHYOBG
— Pawan Kalyan (@PawanKalyan) April 22, 2018
అంతకముందు.ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను ఉద్దేశిస్తూ ‘బట్టలూడదీసి మాట్లాడుకుందాం-బట్టలూడదీసి కొడదాం కార్యక్రమానికి మీకు స్వాగతం.అని ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్.అయితే పవన్ చేసిన ఈ ట్వీట్స్ అతి తక్కువ సమయంలోనే వైరల్ అవుతున్నాయి.
RK, please welcome to ““బట్టలూడదీసి మాట్లాడుకుందాం – బట్టలూడదూసి కొడదాం “ కార్యక్రమానికి మీకు స్వాగతం.. pic.twitter.com/Cu5iBsHQ4Y
— Pawan Kalyan (@PawanKalyan) April 22, 2018