వైసీపీ శ్రేణులకు మంచి ఊపునిచ్చే వార్త ..గత నూట నలబై రెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే మరోవైపు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు క్యూ కడుతూ వైసీపీ గూటికి వస్తున్నారు.ఇటివల అధికార టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి
రవి దాదాపు మూడు వేలమంది అనుచరవర్గంతో వైసీపీ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే .
తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన కాపు సామాజిక వర్గ మాజీ మంత్రి ఒకరు వైసీపీ గూటికి రావడానికి ప్రణాళికలు వేస్తున్నారు .గుంటూరు జిల్లాలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ఆశీస్తున్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలోకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.అందులో భాగంగా మాజీ మంత్రి, బీజేపీ నేత కన్నా లక్ష్మి నారాయణ గుంటూరులోని తన నివాసంలో అనుచరులతో భేటి అయ్యారు.ఈ భేటీ సందర్భంగా కన్నా మాట్లాడుతూ వైసీపీ సీనియర్ నేత ,ఎంపీ విజయసాయి రెడ్డితో సంప్రదింపులు జరిపాను .
తనకు గుంటూరు పశ్చిమ ,తన తనయుడికి పెదకూరపాడు నియోజకవర్గంలో స్థానం కల్పిస్తాను అని జగన్ చెప్పినట్లు భరోసా ఇచ్చారు.రానున్న కాలంలో ఏపీకి ప్రత్యేక హోదా రావాలన్న ..అభివృద్ధి కావాలన్నా జగన్ నాయకత్వాన్ని మనమంతా బలపరచాలి అని చెప్పారు అని సమాచారం.దీనికి తన అనుచరవర్గంతో సహా జిల్లాకు చెందిన మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతో సహా వైసీపీలో చేరాలని చెప్పినట్లు సమాచారం.ఇందులో భాగంగా ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ ను కల్సి మంచి రోజు చూసి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి వైసీపీ కండువా కప్పుకోవడానికి కన్నా సిద్ధమవుతున్నారు ..అయితే కన్నా వైసీపీలో చేరతారు అని పోయిన నెలలోనే చెప్పింది దరువు .వివరాల కోసం కింది లింక్ ఓపెన్ చేయండి ..