ఏపీ అధికార టీడీపీ పార్టీకిచెందిన మహిళ నాయకురాలు ,రాష్ట్రంలోని పాయకరావు పేట అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే వంగలపూడి అనిత కు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదిరిపోయే బిగ్ షాకిచ్చారు .ఇటివల తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ సభ్యురాలిగా ఎమ్మెల్యే అనితను సభ్యురాలిగా నియమించిన సంగతి విదితమే .తాజాగా ఆమె ఇంకా టీటీడీ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేయకముందే బాబు ఆమెను పదవి నుండి తప్పించారు .
అయితే ఎమ్మెల్యే అనిత ఇటివల ఒక ప్రముఖ వెబ్ మీడియా ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ నేను పక్కా క్రైస్తావురాల్ని ..నాచేతిలో ఎప్పటికి ఒక బైబిల్ ..కార్లో ఇంకో బైబిల్ ఉంటుంది .కానీ నాకు హిందు దేవుళ్ళు అంటే అభిమానం అని చెప్పిన సంగతి తెల్సిందే .అయితే టీటీడీలో అన్యమతానికి చెందినవారని నియమిస్తున్నారు అని విమర్శలు వస్తోన్న నేపథ్యంలో చేసేది ఏమి లేక చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు అని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు .
అనిత ప్రమాణ స్వీకారం చేయకముందే పదవి నుండి తప్పించడంపై నెటిజన్లు సోషల్ మీడియాలో “పాయకరావుపేట గౌరవ ఎమ్మెల్యే వంగలపూడి అనిత గారికి టీటీడీ పాలక మండలి సభ్యురాలిగా ఉద్వాసనదీపము వెలిగించినట్టు వెలిగించి ఆర్పేశారు సార్ఇది సాంప్రదాయం కాదు మన ,దేశంలోటీటీడీ బోర్డు నుంచి ఎమ్మెల్యే ఔట్ అని సెటైరికల్ పోస్టులు పెడుతున్నారు ….