ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. 141వ రోజు ఈదర శివారు నుంచి శనివారం ఉదయం వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం సీతారాంపురం, బత్తులవారిగూడెం క్రాస్ మీదుగా పాదయాత్ర కోనసాగుతుంది.
పాదయాత్రలో బాగంగా నూజివీడులోని చిన్న గాంధీ బొమ్మ సెంటర్కు చేరుకుని వైఎస్ జగన్ బహిరంగ సభ నిర్వహించన్నున్నారు. అయితే వైఎస్ జగన్ పాదయాత్రలో ఆశీర్వాదం కోసం వచ్చిన పెళ్లి జంటను తనే పెళ్లి పెద్ద అయ్యి ఊరేగింపు ముందు ఉండి నడిపించాడు. డప్పులు కొట్టుకుంటూ..పాటలు పాడుకుంటూ..ఆనందంతో వైఎస్ జగన్ తో పెళ్లి వారు కూడ ఇదే ఊరేగింపు అనుకొని నడిచారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. కొంతమంది అయితే జగన్ అంటే మరి ఇంత ఇస్టమా అని కామెంట్లు పెడుతున్నారు. ఇక వైసీపీ ఫ్యాన్స్ అయితే ఏంతో సంతోషంతో తమ నాయకుడి గొప్పతన్నాని..సాదరణమైన ప్రజలతో ఎంత అప్యాయతగా ఉంటాడో తెలియజేయాలని సోషల్ మీడియాలో షేర్లు..మీద షేర్లు చేస్తున్నారు.