టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌ను ముఖ్యమంత్రిగా వెండి తెరమీద చూపించడంలో 100% సక్సెస్ అయ్యాడు దర్శకుడు. తను తీసే ప్రతి చిత్రంతో ఏదోక అంశానికి వాణిజ్య విలువలు జోడించి చాలా స్ట్రాంగ్‌గా చెప్పే అలవాటున్న దర్శకుడు కొరటాల శివ ‘భరత్ అనే నేను’ చిత్రంతో ఈ సారి రాజకీయాలపై దృష్టి సారించారు. రాజకీయాలకు అల్లంత దూరంలో ఉండే మహేశ్‌ను ముఖ్యమంత్రి పాత్రకు ఒప్పించడంలోనే పూర్తిగా విజయం సాధించారు శివ . రాజకీయాల్లోకి కొత్తగా ఎంటరైన ఓ వ్యక్తికి కొన్ని సమస్యలు ఎదురైతే వాటిని ఎలా పరిష్కరించుకొవలో అది ప్రజలకు ఎలా తెలియాలో సినిమా ద్వార అర్థం అయ్యో విదంగా చూపించారు.
సాధారణంగా రాజకీయ నాయకులు ఓ సమస్యను పరిష్కరించాలనుకొన్నప్పుడు రాజకీయ కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఈ ముఖ్యమంత్రి సీజన్డ్ పొలిటీయన్ కాదు. ‘నాకు ఒక జాబ్ ఇచ్చారు. అందులో ఇలాంటి సమస్య వస్తే ఇలా చేయమని ఉంది. అలాగే చేయాలి తప్ప లెక్కలేసుకుంటూ కూర్చుంటే ఎలా’ అనుకొనే మనస్తత్వం ఈ ముఖ్యమంత్రిది. చేతిలో అధికారం ఉంటే, చేయాలనుకొంటే చిటికెలో ఏ పనైనా చేయవచ్చని నిరూపించే ముఖ్యమంత్రి అంటూ ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు . ఇక అసలు విషయానికి వస్తే 2019లో ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో అదే ఈ సినిమాలో చూపించారని సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు తెగ హల్ చల్ చేస్తున్నారు.
గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది.. ఊరూరా టీడీపీ నేత ల దౌర్జన్యాలు మితిమీరిపోయాయి..విచ్చలవిడిగా నేరాలు ఎన్ని రకాలు ఉంటాయో అన్నినేరాలు ఏపీలో తెలుగు తమ్ముళ్లు చేస్తున్నారని.. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే చాలు దాడులు చేస్తున్నారని . భరించలేకపోతున్నామన్నా..’అంటూ ప్రజలు ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌తో గోడు వెళ్లబోసుకున్న తెలిసిందే. అయితే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తాడు..గ్రామాలకు ఏలా న్యాయం చేస్తాడు..రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలానుకున్నాడో అలా ప్రతిది వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తాడో అదే భరత్ అనే నేను’సినిమాలో చూపించాడని వైసీపీ ఫ్యాన్స్ తెగ షేర్లు చేసుకుంటున్నారు.