సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలైయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా ఓ రేంజ్‌లో ఆడుతూ ఉంది. థియేటర్ల వద్ద గురువారం అర్ధరాత్రి నుంచే మహేష్ అభిమానులు అలంకరణలు చేస్తూ, డీజే సౌండ్‌లతో డ్యాన్సులు చేస్తూ నానా రచ్చ రచ్చ చేశారు. అమెరికాలోనే ఏకంగా 2 వేల ప్రీమియర్ షోలు వేశారు. అయితే భరత్ అనే నేను’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మహేశ్ బాబు కెరీర్లోనే అతి పెద్ద హిట్ సొంతం చేసుకున్నాడు. మాట తప్పని సీఎంగా భరత్ పాత్రలో ఒదిగిపోయిన ప్రిన్స్.. బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టే పని మొదలుపెట్టాడు. శ్రీమంతుడు సినిమాతో ప్రిన్స్‌తో కలిసి హిట్ కొట్టిన కొరటాల శివ, సూపర్ స్టార్‌తో వరుసగా రెండో హిట్ కొట్టాడు. యంగ్ సీఎంగా మహేశ్ అదరగొట్టినాడని ,ముఖ్యమంత్రిగా మహేశ్ బాబు నటన ఈ సినిమాకే హైలెట్ అని మూవీ చూసిన వాళ్లు చెబుతున్నారు.
మరోపక్క మహేశ్ రాజకీయాల వద్దంటున్నా, జనాలు మాత్రం ఈ హీరోని వదిలేలా లేరు. ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతంలోని వైసీపీ ఫ్యాన్స్ మహేశ్‌ను పూర్తిగా ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు కాదనుకోండి, ఎప్పుడో కాంగ్రెస్ హయాం నుంచినే మహేశ్ బాబు సినిమా వస్తోందంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కటౌట్లు కట్టే వాళ్లు. ఆ తర్వాత ఆ పరంపర వైసీపీ వాళ్లు బాధ్యతగా తీసుకున్నారు. మహేశ్ బాబును బాగా ఓన్ చేసేసుకుని, ఈ హీరో సినిమా వచ్చినప్పుడల్లా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘భరత్ అనే నేను’కు కూడా వైసీపీ వాళ్లు భారీ ఎత్తున స్వాగతం పలికారు. ఇది అనంతపురంలోని సీన్. అక్కడి శాంతి థియేటర్లో భరత్ అనే నేను విడుదల సందర్భంగా వైసీపీ అభిమానులు ఈ కటౌట్ ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కటౌట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. వైసీపీ ఫ్యాన్స్ తెగ షేర్ల్ చేసుకుంటున్నారు.