శ్రీరెడ్డి, టాలీవుడ్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, అలా కాకుండా, తెలుగు సినీ ఇండస్ర్టీలో తెలుగు వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వారి జీవనోపాధికి తోడ్పాటునందించాలని డిమాండ్ చేస్తూ సినీ ఇండస్ర్టీపై యుద్ధం చేస్తున్న సంగతి తెల్సిందే.అయితే ఈ కాస్టింగ్ కౌచ్ వ్యతిరేక ఉద్యమం కాస్తా వ్యక్తిగత వివాదాలకు దారితీస్తున్నది. మొన్న పవన్ కల్యాణ్ తల్లిని ఉద్దేశించి నటి శ్రీరెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత క్షమాపణలు కోరడం తెలిసిందే. తాజాగా శ్రీరెడ్డి వ్యక్తిగత జీవితానికి సంబంధించి నటి కరాటే కల్యాణి విడుదల చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
‘కల్యాణి లీక్స్ మొదలయ్యాయి. పెళ్లి కాని విమలకు(శ్రీరెడ్డి అసలు పేరును చెబుతూ) ఇంటర్ పూర్తిచేసిన కూతురుంది. గడిచిన 10 ఏళ్ల నుంచి తల్లిదండ్రులతో సంబంధాలు లేవని శ్రీరెడ్డి చెప్పింది. కానీ కొంతకాలం కిందట కూకట్పల్లిలో కోట్ల విలువైన ఫ్లాట్లోకి గృహప్రవేశం చేసినప్పుడు ఆమె వెంట తల్లికూడా ఉన్నారు. ఇదికాకుండా తను ఖరీదైన కార్లలో తిరుగుతుంది. ఇవన్నీ కొనడానికి డబ్బులు ఎలా వచ్చాయో ఆమెకే తెలియాలి. మరికొన్ని లీక్స్ నాకు నచ్చినప్పుడు బయటపెడతా.. నా లీక్స్ నా ఇష్టం’’ అని నటి కరాటే కల్యాణి తన పేస్ బుక్ ఖాతాలో ఫోటోలను బహిర్గతం చేసింది.ఆ ఫోటోలు మీకోసం..
కల్యాణి లీక్స్ ( truths) మొదలయ్యాయి అని భావించేవాళ్లకు .. ఈ pics..పెళ్లి కాని విమలకు ఇంత పెద్ద కూతురు ఎక్కడినుండి…
Posted by Kalyani Padala on Friday, 20 April 2018