ఓ పక్క… 450 పైచిలుకు పార్లమెంట్ స్థానాలు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలుగా సోనియా గాంధీ, అప్పటి ప్రధాన మంత్రి కూడా కాంగ్రెస్‌కు విధేయుడే.. కానీ, మరో పక్క ఒకే ఒక్కడు.. ఎదిరించాడు. తనపై అక్రమ కేసులు బనాయించినా భయపడలేదు. కాంగ్రెస్‌ను, సోనియా గాంధీని ఎదిరించిన దమ్మున్న మగాడు, మొనగాడు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీనియర్ సినీ నటుడు పృథ్వీ.
కాగా, ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు పృథ్వీ మాట్లాడుతూ.. ఒకప్పుడు ఎన్టీఆర్, రాజశేఖర్‌రెడ్డి ధైర్య సాహసాలను చూశా.. నేడు అదే ధైర్యాన్ని, సాహసాలను జగన్‌మోహన్‌రెడ్డిలో చూస్తున్నానని, కొన్ని కోట్లు ఇచ్చినా రాని జనం.. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు రావడం చూస్తుంటే.. 2019 ఎన్నికల్లో జగన్ సీఎం కావడం ఖాయమని చెప్పారు.
నేను, ఇటీవల ఉభయ గోదావరి జిల్లాలకు షూటింగ్ కోసమని వెళ్తే ప్రస్తుత రాజకీయాలపై అక్కడి ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నాని, ఎవరి నోట విన్నా 2019లో జగన్‌ను సీఎంగా చూడాలన్నదే మా కోరిక అంటూ చెప్పడం తనను ఆశ్చర్య పరిచిందన్నారు పృథ్వీ. అంతేకాక, ప్రజా సంకల్ప యాత్రతో ప్రజల్లో జగన్‌కు ఆదరణ పెరిగిందని, దీన్నిబట్టి చూస్తే 2019లో జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమనే అభిప్రాయాన్ని ఉభయగోదావరి జిల్లాల ప్రజలు వ్యక్తపరిచినట్లు చెప్పారు నటుడు పృథ్వీ.