జనసేన అధినేత ,ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మరో సారి ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ,అతనికి వంతు పాడే మీడియాగా పవన్ ఆరోపిస్తున్న ఏబీఎన్ ,టీవీ9 పేర్లను పరోక్షంగా ప్రస్తావిస్తూ సంచలన ట్వీట్లు చేశారు.ఇప్పటికే టీడీపీ ,ఆ పార్టీ అనుకూల మీడియాను వరస ట్వీట్లతో దుమ్ము దులుపుతున్నాడు.తాజాగా ఆయన నిజమైన అజ్ఞాతవాసి ఎవరో మీకు తెలుసా అంటూ ట్వీట్లను మొదలెట్టాడు పవన్ .
అంతే కాకుండా నాకిష్టమైన స్లోగన్ ఫ్యాక్షనిస్టుల ఆస్తులను జాతీయం చేయాలి ..ఈ స్లోగన్ వెనక ఉన్న అసలు కథ ఏమిటి అంటూ పరోక్షంగా టీవీ9 స్లోగన్ ను గుర్తుచేస్తూ ట్వీట్ చేశాడు.మరోవైపు స్టే ట్యూన్ డ్ లైవ్ ఫ్రమ్ హైదరాబాద్ నిజాలను నిగ్గు తేలుద్దాం ప్రోగ్రాం నుండి మీ పవన్ కళ్యాణ్ అంటూ పరోక్షంగా ఏబీఎన్ పేరును ప్రస్తావిస్తూ ట్వీట్ చేశాడు .
అంటే కాకుండా ఒక రాష్ట్ర క్యాబినెట్ మంత్రి స్వయానా ఈ అజ్ఞాతవాసి ని వాడో బ్లాక్ మెయిలర్ అని స్వయంగా ముఖ్యమంత్రి గారు అన్నారని ఒకరితో అన్నారు ..ఆ మంత్రి ఎవరు ..ఆ ముఖ్యమంత్రి ఎవరు ..ఒకరు ..ఎవరు తెలుసుకోవాలని ఉందా స్టే ట్యూన్ డ బట్టలు విప్పి మాట్లాడుకుందాం ప్రోగ్రాం నుండి పవన్ కళ్యాణ్ విత్ కెమరా మ్యాన్ ట్విట్టర్ అని పోస్టు చేశారు పవన్ కళ్యాణ్..