జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ9 సీఈఓ రవిప్రకాష్ కు ట్విట్టర్ వేదికగా అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.ఈ క్రమంలో తన తల్లిని అసభ్యంగా తిట్టించడం వెనక అసలు సూత్రదారి టీవీ9 ఛానల్ సీఈఓ రవిప్రకాష్ ఉన్నారని వెల్లడిస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు.
ఈ క్రమంలో రవిప్రకాష్ నిన్ను వేచి చూసేలా చేస్తున్నందుకు క్షమాపణలు ..అందుకు కొంత సమయం ఇవ్వు .కొద్దిసేపు వేచి చూడు రవిప్రకాష్ నీకు వ్యక్తిగతంగా మెసేజ్ పంపిస్తాను అంటూ పవన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు ..
ఇదే క్రమంలో తన అభిమానులను ,జనసేన కార్యకర్తలను ఉద్దేశిస్తూ మీరు ఆవేశపడకండి ..న్యాయమే గెలుస్తుంది.కావాలని కొందరు కుట్రలు చేస్తున్నారు.మీరు వాళ్ళకు ఆయుధాలుగా మారవద్దు .నేను ఏ తప్పు చేయలేదు ..న్యాయపోరాటం చేస్తాను ఆయన విన్నపం చేశారు.