జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుల మధ్య వార్ కొనసాగుతున్న సంగతి విదితమే .అందులో భాగంగా పవన్ ట్విట్టర్ వేదికగా చంద్రబాబు ,అతని అనుకూల మీడియాగా ముద్రపడిన తన ఆస్థాన మీడియా మీద నిప్పులు చెరుగుతున్నారు.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణల మీద ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ9 యజమాని శ్రీనిరాజు పవన్ కు లీగల్ నోటీసులు పంపించారు .ఈ లీగల్ నోటిసుల మీద పవన్ కళ్యాణ్ స్పందిస్తూ తమ రాజకీయ బాసులతో కుమ్మక్కై టీవీ 9 యజమాని ,సీఈఓ రవి ప్రకాష్ తో కల్సి తనకు లీగల్ నోటీసులు పంపించారు అని ఆయన ట్వీట్ చేశాడు ..