తెలంగాణ రాష్ట్ర యువనేత, ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్విటర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. ట్విటర్‌లో ఎవరు ఏ అభ్యర్థన చేసినా, ఎవరూ ఏ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చినా.. వెంటనే స్పందిస్తుంటారు. ఆపదలో ఉన్నవారికి అన్నా అంటే ఆదుకునే గొప్ప మనసు మంత్రి కేటీఆర్ ది. ట్విట్టర్ వేదికగా ఇప్పటికే ఎంతో మంది తమ కష్టాలు, సమస్యలపై కేటీఆర్ కు ట్విట్ చేస్తారు.కొన్ని సార్లు చిలిపి సమాధానాలతో జోకులు వేస్తుంటారు.
తాజాగా ఓ ఐపీఎల్ ప్రేమికుడు మంత్రి కేటీఆర్ కు ఇప్పటివరకూ ఎవరూ చేయలేని ట్విట్ చేశాడు . బట్టు సాయితేజ అనే వ్యక్తి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఉప్పల్ స్టేడియంలో జరిగే SRH మ్యాచ్ కి సంబంధించిన మూడు ఫ్రీ టికెట్లు ఇప్పించండి సార్ అని ట్విట్ చేశాడు. అయితే మంత్రి కేటీఆర్ ఈ ట్వీట్‌పై తనదైన శైలిలో స్పందించారు. ‘నా వల్ల కాదు బాబూ..’ అంటూ ఓ దండం పెడుతూ రీట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Naa Valla Kaadu Babu ? https://t.co/mtPCxasMrq
— KTR (@KTRTRS) April 21, 2018