ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ముగించుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. వైఎస్ జగన్ ఎండను సైతం లెక్కచేయకుండా అవివరామంగా, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వైఎస్ జగన్ అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు తమకు పింఛన్ రావడం లేదని, నిరుద్యోగులు అయితే, చంద్రబాబు సర్కార్ ఉద్యోగాల నోటిఫికేషన్లు వదలడం లేదని, రుణమాఫీ, డ్వాక్రా రుణాలు ఇలా వారి వారి సమస్యలను వైఎస్ జగన్ తో చెప్పుకుంటున్నారు.
అయితే, తన ప్రజా సంకల్ప యాత్రతో 136వ రోజు కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అదే రోజున ఏర్పాటు చేసిన ప్రజా సంకల్ప యాత్ర బహిరంగ సభలో వైఎస్ జగన్‌కు వంగవీటి రాథా మాట్లాడుతూ.. కృష్ణమ్మ సాక్షిగా చెప్తున్నా.. కృష్ణా జిల్లాలో ఉన్న 17 అసెంబ్లీ సీట్లను వైసీపీకే వచ్చేలా నిరంతరాయంగా కృషి చేస్తానంటూ వైఎస్ జగన్ ఎదుట ప్రమాణం చేశారు.
అలా వైఎస్ జగన్‌కు ఇచ్చిన మాట ప్రకారం వంగవీటి రాథా కృష్ణా జిల్లాలో ఉన్న 17 అసెంబ్లీ నియోజక వర్గాల్లో వైసీపీ జెండా ఎగిరేలా తనవంతు కృషి చేస్తున్నారు. అందుకు సంబంధించి వంగవీటి రంగా అభిమానులతో నియోజకవర్గాల వారీగా.. 17 అసెంబ్లీ స్థానాల్లోనూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 9 నియోజకవర్గాల్లో ఈ సమావేశాలు పూర్తి కాగా, మరో 8 నియోజకవర్గాల్లో వంగవీటి రంగ అభిమానులతో వంగవీటి రాథా సమావేశం కానున్నారు. ఇలా, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు వంగవీటి రాథా తనవంతు పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయం తెలిసిన జగన్.. వంగవీటి రాథాను మరింత ప్రోత్సహించడంతోపాటు సహాయ సహకారాలు అందిస్తున్నారని వైసీపీ శ్రేణులు అంటున్నారు.