Home / MOVIES / దర్శకులు, నిర్మాతలు నన్ను రమ్మన్నప్పుడు..గీతామాధురి సంచలన వాఖ్యలు..!

దర్శకులు, నిర్మాతలు నన్ను రమ్మన్నప్పుడు..గీతామాధురి సంచలన వాఖ్యలు..!

తెలుగు హీరోయిన్లకు గుర్తింపు లభించడం లేదని, వేషాల ఇస్తామని చెప్పి తనను శారీరకంగా వాడుకొన్నారంటూ సినీ ప్రముఖులపై వ్యాఖ్యలు చేయడంతో టాలీవుడ్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఒక్కొక్కటిగా బయటకువస్తూనే ఉన్నాయి. శ్రీరెడ్డి తనకు జరిగిన అన్యాయంపై అలుపెరగని పోరాటం చేస్తుంటే తాజాగా గీతామాధురి కూడా తనకు ఎదురైన కొన్ని సమస్యలను వివరిస్తూ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. నేను మొదట్లో తెలుగు సినీపరిశ్రమకు వచ్చాను. అది కూడా బుల్లితెర నుంచే. ఒక టివీ షోలో పాటలు పాడిన తరువాత నాకు సినిమాల్లో పాడే అవకాశాన్ని దర్శకులు కల్పించారు.

మొదట్లో తెలుగు సినీపరిశ్రమలో నాకు ఇచ్చిన ప్రాధాన్యతను చూసి సంతోషపడ్డా. ఆ తరువాత చాలా ఇబ్బందులకు గురయ్యా. అదే అవకాశాలు కావాలంటే దర్శకులు, నిర్మాతలు రమ్మని పిలవడం. నేను గాయనని. నాకు కూడా ఇలాంటివి ఉంటాయని అనుకోలేదు. మొదట్లో సినిమాల్లో పాటలు పాడకముందు నా స్నేహితులు ఇదంతా జరుగుతుందని చెప్పారు. కానీ నేను నమ్మలేదు. కొంతమంది దర్శకులు, నిర్మాతలు నన్ను రమ్మన్నప్పుడు చాలా బాధపడ్డా. నా టాలెంట్‌కు ఇప్పటితో పుల్‌స్టాప్ పడిపోతుందని అనుకున్నా. కానీ నన్ను అలా పిలిచిన దర్శకుల దగ్గరకు అస్సలు వెళ్ళలేదు. వారి గురించి ఆలోచించడం తగ్గించాం. మంచి వ్యక్తులు అవకాశాలు ఇస్తే సినిమాల్లో పాటలు పాడాలని నిర్ణయించుకున్నా. అనుకున్న విధంగానే నాకు మరికొంతమంది అండగా నిలిచారు.. అవకాశాలిచ్చారు. ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో నేను గాయనిగా మంచి గుర్తింపును సంపాదించుకుంటూ వెళుతున్నందుకు ఎంతో సంతోషపడుతున్నానంటోంది గాయని గీతామాధురి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat