ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల్లో అప్పుడే అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి .ఎప్పటి నుండో ఉన్న వర్గపోరు ఒక్కసారిగా బట్టబయలు అయింది .అందులో భాగంగా రాష్ట్రంలోని వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన బద్వేల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది.
ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మకు ,ప్రస్తుత ఎమ్మెల్యే అయిన జయరాములు మధ్య నడుస్తున్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి.ఈ క్రమంలో ఎమ్మెల్యే జయరాములు విజయమ్మపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు .రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఉండగా రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిత్వం గురించి ఎందుకు మాట్లాడతారు అంటూ ఆమెపై ఫైర్ అయ్యారు .
జిల్లా స్థాయి నాయకత్వం కూడా ఎస్సీలను అణగ దోక్కుతున్నారు అని ఆయన విరుచుకుపడ్డారు .పార్టీను నమ్మి టీడీపీ కండువా కప్పుకుంటే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే అని తనను ,తన సామాజిక వర్గాన్ని అణగదోక్కుతున్నారు ..తనకు ,తన సామాజిక వర్గానికి జరుగుతున్నా అన్యాయం మీద పార్టీ అధిష్టానం స్పందించకపోతే గ్రామస్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు అందరం టీడీపీ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం అని ఆయన హెచ్చరించారు ..