సినీ నటుడు కృష్ణమరాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.సీఎం చంద్రబాబు శుక్రవారం తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఏపీకి ప్రత్యేక హోదా కోసమంటూ ధర్మపోరాటం పేరుతో దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, 2014లో తిరుమల తిరుపతిలోని శ్రీ వేంకటేఝశ్వర స్వామి సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యత నాదంటూ ప్రజలకు హామీ ఇచ్చిన చంద్రబాబు.. తాను ముఖ్యంత్రి పదవిలో ఉండి, నాలుగేళ్లు గడిచినా ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించకపోవడాన్ని ఏపీ ప్రజలు తప్పుపడుతున్నారు. ప్రత్యేక హోదా సాధించే బాధ్యత నాది అంటూ చెప్పిన నీవు.. నాలుగేళ్ల తరువాత ధర్మపోరాట దీక్ష చేపట్టడం ఏంటి చంద్రబాబు..? అంటూ రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ధర్మపోరాట దీక్షపై స్పందించిన కృష్ణమురాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ ప్రముఖులను సన్నాసుల్లాగాను, దద్దమ్మల్లాగానూ సంభాషించడం సరికాదన్నారు. నాడు ప్రత్యేక హోదా కోసం పోరాడిన వాళ్లను నడి రోడ్డుపై బట్టలూడదీసి కొట్టించిన నీకు (చంద్రబాబు) మాట్లాడే అర్హత లేదన్నారు. అందులోనూ సినీ నటుడు సంపూర్ణేష్‌బాబును ఏకంగా జైల్లో పెట్టించింది నిజం కాదా..? 2014 ఎన్నికల్లో ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా నెరవేర్చావా.? కోట్లకు కోట్లు పోసి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరమేమొచ్చింది అంటూ చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు సినీ నటుడు కృష్ణమరాజు.