ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ మరో వివాదానికి తెరలేపాడు.పవన్ విషయంలో చాలా హాట్ టాపిక్ గా మారాడు.నటి శ్రీ రెడ్డి తో సంచలన వాఖ్యలు చేయించింది తానే అని ఒప్పుకున్న వర్మ పవన్ కి సారీ చెప్పాడు. తల్లి మీద ఒట్టేసి చెబుతున్నాను. మరోసారి పవన్ పై కాని ఆయన ఫ్యామిలీపై ఎలాంటి కామెంట్స్ చేయనని ఫేస్ బుక్ పేజ్ ద్వారా తెలిపిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ఇలా అన్న కొద్ది సేపటికి తన ఒట్టు తీసి గట్టు మీద పెట్టి నిన్న రాత్రి పవన్ చేసిన ట్వీట్స్ కి లాజికల్ గా బదులిచ్చాడు. పవన్ వేసిన మరి కొన్ని ప్రశ్నలకి కూడా వర్మ తన పేస్ బుక్ ఖాతాలో సమాధానం ఇచ్చారు. వాటిపై మీరు ఓ లుక్కేయండి…
