పవన్ కళ్యాణ్ వరస పోస్టులతో ఇటు రాజకీయ అటు సినిమా వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాడు.తనపై ,తన తల్లి గురించి ప్రముఖ నటి శ్రీరెడ్డి అసభ్య వ్యాఖ్యలు చేయడానికి ప్రధానకారణం ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడు ,అతని మిత్రుడు కిలారు రాజేష్ అని
మార్నింగ్ వరస ట్వీట్లతో పెనుసంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే.
తాజాగా చంద్రబాబు నాయుడుకు అనుకూల మీడియాగా ముద్రపడిన పచ్చమీడియా అని ఆరోపించే టీవీ9,ఏబీఎన్ ఛానల్స్ అధిపతులు అయిన రవిప్రకాష్ ,వేమూరి రాధాకృష్ణ శ్రీనిరాజు ,ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫోటోలను పోస్టు చేస్తూ ఒక సంచలనాత్మక ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్ లో మీ మీ ఛానల్స్ రేటింగ్ కోసం డెబ్బై ఏళ్ళ తన తల్లిని బజారుకీడుస్తారా ..మీ ఇంట్లో ఆడవారు లేరా ..మీకు అమ్మ లేదా అంటూ తీవ్ర ఆవేదనతో ఆయన పోస్టు చేశారు.ఏపీలో ప్రజలకు ఏమి సమస్యలు లేవన్నట్లు ఏకంగా తనపై ,తమ కుటుంబం మీద ఎవరో ఆరోపణలు చేస్తే మార్నింగ్ నుండి రాత్రి పడుకునేవరకు స్పెషల్ కార్యక్రమాలను ప్రచారం చేస్తూ మా కుటుంబం మీద దాడి చేశారు.ఇది అంతా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగింది.అందరికి పది కోట్ల వరకు డీల్ కుదిరిందని ఆయన ఆరోపించారు .ఆయన పోస్టు చేసిన ఫోటోలను కింద చూడవచ్చు ..