ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రత్యేక హోదా సాధన కమిటీ కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు ఫైరయ్యారు. కాగా, విభజన హామీలు నెరవేర్చాలంటూ సీఎం చంద్రబాబు ఇవాళ విజవాడ మున్సిపల్ స్టేడియంలో ఒక్క రోజు దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు చేస్తున్న దీక్షపై చలసాని శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీక్షా వేదిక, స్టేడియం ఏర్పాట్లకే రూ.2 కోట్లు, అలాగే, అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ నిధులతోనే టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు దీక్షలు చేస్తున్నారని, ఇలా ఒక్క రోజు దీక్ష కోసం రూ.30 కోట్లకు పైగా ప్రజల ధనాన్ని స్వలాభం కోసం ఖర్చుపెడుతారా..? అంటూ చంద్రబాబును చలసాని ప్రశ్నించారు. ప్రతిపక్షాల బంద్ వల్ల ఆర్టీసీకి రూ.12 కోట్లు నష్టం వచ్చిందన్న నీవు.. నేడు దీక్ష పేరుతో రూ.30 కోట్ల ప్రజాధనాన్ని చంద్రబాబు ఖర్చుపెట్టడాన్ని చలసాని తప్పుబట్టారు.
నాడు పిల్లనిచ్చిన దివంగత ముఖ్యమంత్రిని, నేడు ముఖ్యమంత్రిని చేసిన ఏపీ ప్రజలను నారా చంద్రబాబు నాయుడు ఊహించని రీతిలో వెన్నుపోటు పొడిచారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసలే అప్పుల్లో ఉంటే.. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు మాత్రం ఈవెంట్లకంటూ వేలకోట్ల రూపాయలను ఖర్చు చేస్తారా.? అంటూ ప్రశ్నించారు.