వృద్ధులైన తల్లిదండ్రుల విషయంలో కొందరు కుమారులు, కుమార్తెలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న తీరు గురించి నిత్యం పత్రికల్లో ఎన్నో వార్తలు వస్తున్న తీరును మనమంతా చూస్తున్నాం. వయసు పైబడిన వారిని అనాథలుగా పట్టించుకోని సుపుత్రులు ఎందరో. అయితే ఓ యువకుడు తన తల్లికోసం తన చదువును పక్కనపెట్టాడు. తల్లిని సాకేందుకు అంకితమమయ్యాడు. నిలువ నీడ లేకున్నా…కంటికి రెప్పలాగా కన్న తల్లిని కాపాడుకుంటున్నాడు. అలాంటి వ్యక్తికి ఏదైనా సహాయం చేయాలన్న కథనం మంత్రి కేటీఆర్ దృష్టికి రావడంతో డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని ఆయన అధికారులను కోరారు.
వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన బాబి తండ్రి తెల్లం రాజులు 12 ఏండ్ల క్రితం చనిపోయాడు. పదేండ్ల క్రితం తల్లి జయమ్మకు అదే వ్యాధి సోకింది. దీంతో ఆయన అక్క అయిన కరుణ కూలి పనులు చేస్తూ ఎనిమిదేండ్లపాటు తల్లితోపాటు తమ్ముడు బాబిని సైతం పోషించింది. అయితే రెండేండ్ల కిందట ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో తన తల్లికి బాబికి అంతా తానయ్యాడు. తమకు ఉన్న చిన్న ఇంటి సమీపంలోనే తన తల్లికి ఉదయం కాలకృత్యాలు మొదలుకొని స్నానం దుస్తులు వేయడం వరకు అన్నీ ఆయనే చేస్తాడు. అన్నం వండి తినిపించడం వరకు ఆయనదే బాధ్యత. ఇవన్నీ చేసి కూలిపనికి వెళ్లే బాబి ఉదయం ఓ పత్రికలో రాగా..నెటిజన్ ఒకరు ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మంత్రి కేటీఆర్ స్పందంచారు. ‘ఇటీవలి కాలంలో తల్లిదండ్రులుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అనేకమంది పిల్లల ఉదంతాలు చూస్తున్న క్రమంలో..తన తల్లి కోసం బాబి చేస్తున్న తీరు హృదయాన్ని ధ్రవిస్తోంది. ఆయనకు డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయగలరు’ అంటూ భద్రాద్రి కలెక్టర్‌ను కోరారు.