కర్నూలు జిల్లా నుండి కేంద్ర మంత్రిగా పనిచేసిన కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి టీడీపీ.బీజేపిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో నవ్యాంధ్ర రాష్ట్రంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెల్సిందే.అయితే అధికారంలోకి వచ్చిన నాలుగు యేండ్ల నుండి పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని భ్రస్టు పట్టించిందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ గత నాలుగు ఏండ్లుగా పోరాడుతూనే ఉంది. ఇందులో బాగంగానే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు పతనం తప్పదని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. గురువారం దేవనకొండలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రధాని మోదీ ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ పాలనకు ప్రజలే చరమగీతం పాడుతారన్నారు. దీని బట్టి తెలుస్తుంది 2019లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అని ఇన్ డైరెక్ట్ గా అన్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రేమనాథరెడ్డి, అలారుదిన్నె నారాయణరెడ్డి, బొజ్జప్పనాయుడు, సంపంగి గోవిందరాజులు, రాజాసాహెబ్, బండ్లయ్య తదితరులు పాల్గొన్నారు.
