తెలుగుదేశం పార్టీ అధినేత ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ తన పుట్టిన రోజు సందర్భంగా ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్మ పోరాట దీక్ష పేరుతో ఒక్కరోజు దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో చంద్రబాబు చేస్తున్న ధర్మ పోరాట దీక్షపై ఏపీ ఫైర్ బ్రాండ్, వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు.చంద్రబాబు చేపట్టినది నిరాహారదీక్ష కాదని, ఉపవాసదీక్ష అని ఆమె ఎద్దేవా చేశారు.
మొన్న విజయవాడలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జనాలు బ్రహ్మరథం పట్టారని… ఆ భయంతోనే చంద్రబాబు ఇప్పుడు దీక్షకు కూర్చున్నారని చెప్పారు. టిఫిన్లు చేసి వచ్చి దీక్షలు చేపడుతున్నారని విమర్శించారు.బాబు ఒక్కరోజు దీక్ష పేరుతో 30 కోట్లు ఖర్చు చేస్తున్నారని..అవగాహన లేని క్రీడాకారులతో చంద్రబాబు దీక్షా వేదికపై భజన చేయించుకుంటున్నారన్నారు. దీక్ష విజయవాడలో చేస్తే ఏం లాభం ఏముంటదని .. ఢిల్లీలో చేయాలని ఈ సందర్భంగా రోజా సూచించారు. టీడీపీ ఎంపీలు రాజీనామా అప్పుడే చేసి ఉంటే కేంద్ర దిగి వచ్చేదని రోజా చెప్పారు .