ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ,కైరా అద్వానీ హిరోయిన్ గా జంటగా నటించిన సినిమా భరత్ అనే నేను .ఈ మూవీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదల అయిన విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా టీజర్,పాటలకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పై మంచి టాక్ ఉంది.ఇప్పటికే ఈ సినిమా చూసినా ప్రేక్షకులు తమ తమ ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.సినిమా బాగుందని అభినందిస్తున్నారు.
అయితే ప్రముఖ సినిమా క్రిటిక్ కత్తి మహేష్ ఈ సినిమా చూసి రివ్యూ ఇచ్చేశాడు. ‘‘భరత్ అనే నేను సినిమా సింపుల్ స్టోరీ కానీ అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. మహేష్ తన క్యారెక్టర్‌లో లీనమైపోయి నటించారు. కొరటాల శివ నిజమైన ప్రజాస్వామ్యంలో ఏదైతే కచ్ఛితంగా సాధ్యమవుతుందో దానిని కళ్లకు కట్టినట్టు చూపించారు. భరత్ అనే నేను ఒక స్ఫూర్తిదాయకమైన సినిమా. ప్రతి ఒక్కరూ వెళ్లి చూడండి’’ అంటూ కత్తి మహేష్ తన పేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు.