ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,అతని తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన తన అధికారక సోషల్ మీడియాలోని ట్విట్టర్ వేదికగా పలు ఆరోపణలు చేశారు.గత కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేస్తున్న ప్రధానాంశం క్యాస్టింగ్ కౌచ్.ఇండస్ట్రీలో ఎప్పటి నుండో వ్రేళ్ళు పెనవేసుకోని ఉన్న ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు ప్రముఖ నటి శ్రీరెడ్డి.
అయితే శ్రీరెడ్డి ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినప్పుడు అందరూ సపోర్టు చేశారు.అయితే శ్రీరెడ్డి ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.దీంతో ఇటు రాజకీయ అటుసినిమా వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది.ఏది అన్న ఉంటె ఎదుర్కోవాలి ..పవన్ పై పోరాడాలి కానీ పవన్ వ్యక్తిగత విషయాల గురించి ,కుటుంబ సభ్యుల గురించి ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ముక్త కంఠంతో వ్యతిరేకించారు.తాజాగా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,అతని తనయుడు నారా లోకేష్ నాయుడు ,లోకేష్ మిత్రుడు కిలారు రాజేష్ కల్సి ఒక నటిని అడ్డుపెట్టుకొని నాపై కుట్రలు చేశారు.
అందుకు పలు మీడియా సంస్థలకు పది కోట్ల మేర డీల్ ఒప్పందం చేస్కొని నాపై బురద చల్లుతున్నారు.ఒకానొక సమయంలో నన్ను చంపడానికి కుట్రలు కూడా చేస్తున్నారు అని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు.శ్రీరెడ్డి వ్యవహారం అంత ఏపీ సచివాలయంనుండే లోకేష్ అతని మిత్రుడు రాజేష్ డైరెక్షన్ లో మీడియా ,శ్రీరెడ్డి తనపై బురద చల్లడానికి ప్రయత్నాలు చేశారు అని ఆయన ఆరోపించారు.అంతే కాకుండా ఈ వ్యవహారం అంతా నారా చంద్రబాబు నాయుడుకు తెలుసునంటూ ఆయన ఆరోపించారు.అయితే శ్రీరెడ్డి వ్యవహారం వెనక ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని టీడీపీ నేతల హస్తం ఉందని మొదట్లోనే ఆన్లైన్ వెబ్ మీడియా సంచలనం దరువు చెప్పిన సంగతి తెల్సిందే ..