ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బస్సు మీద ఉన్న ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి బొమ్మ చినిగిందని ఆ బస్సు డ్రైవర్ ,కండక్టర్ మీద విరుచుపడుతూ అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి తెగబడిన సంగతి తెల్సిందే.
దీనికి నిరసనగా ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు సుంకర పద్మశ్రీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీద నిప్పులు చెరిగారు .అంతేకాకుండా దమ్ముంటే ..ఎమ్మెల్యే మగాడు అయితే నేను ఆర్టీసీ బస్సు మీద ఉన్న చంద్రబాబు ఫోటో చించేస్తా ..వచ్చి అడ్డుకోమను ..నాపై దాడి చేయమని సవాలు విసిరారు .వాడికి దమ్ము ధైర్యం ఉంటె ఇప్పుడు వచ్చి నన్ను అడ్డుకోమని ఆమె సవాలు విసిరారు ..