ఏపీ అధికార టీడీపీ పార్టీ సీనియర్ నేత ,అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేపట్టిన సైకిల్ యాత్రలో ఘోరమైన ప్రమాదం జరిగింది.ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు చేపట్టనున్న దీక్షకు సంఘీభావంగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు సైకిల్ యాత్ర చేపట్టారు.
అందులో భాగంగా గుంటూరు జిల్లాలో నరసరావు పట్టణంలో స్వగృహం దగ్గర నుండి సైకిల్ యాత్రను ప్రారంభించి కోటప్పకొండకు బయలుదేరారు.ఈ నేపథ్యంలో ఆయన యలమందల వద్ద సైకిల్ తొక్కుతూ కోడెల కింద పడిపోయారు.దీంతో స్పీకర్ తలకు గాయమైంది.వెంటనే ప్రథమ చికిత్సను అందించారు.