తెలంగాణ రాష్ట్ర యువనేత, మంత్రి కేటీఆర్ పెద్ద మనుసు మరోమారు ప్రశంసలు పొందుతోంది. వైద్యం కోసం దవాఖనకు వచ్చే వారికి గంటల వ్యవధిలో వారి సమస్యకు పరిష్కారం చూపి ఇప్పటికే రాష్ర్టాలకు అతీతంగా అభిమానులను పొందిన మంత్రి కేటీఆర్ తాజాగా ఇద్దరు గల్ఫ్ బాధితుల జీవితాల్లో వెలుగులు నిండాయి. ఉపాధి కోసం కువైట్ వెళ్లి వివిధ కారణాల వల్ల అక్రమ నివాసితులుగా ముద్రపడి స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సిద్ధపడ్డ ఇద్దరికి తెలంగాణ ప్రభుత్వం సహాయం అందించింది. రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల వల్ల మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఉచిత విమాన టికెట్లతో పాటుగా విమానాశ్రయం నుంచి వారి ఇంటి వరకు ఉచిత రవాణ సదుపాయం కల్పించింది.
see also :60,000 మంది జీవితాలను మార్చే మరో అద్భుత నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్
రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన బి.రాజు, ఎ.అనిల్ కొన్నేండ్ల కిందట పాధి కోసం కువైట్ వెళ్లారు. పలు కారణాల వల్ల వారు అక్రమ నివాసితులుగా ఆ దేశం గుర్తించింది. అయితే ఇటీవలి కాలంలో ఆ దేశం ప్రకటించిన క్షమాభిక్షతో వీరు స్వదేశానికి వెళ్లేందుకు అనుమతి పొందారు. అయితే వీరికి టికెట్లు పొందే అంశంలో సమస్యలు ఎదురుకావడంతో కువైట్‌లోని రాయబార కార్యాలయంతో పాటుగా స్థానికంగా ఉన్న స్వచ్ఛంద సేవకుడు గంగుల మురళీధర్ రెడ్డి సహాయం అందించగా ఈ ఇద్దరికి స్వదేశానికి తిరిగి వచ్చేందుకు టికెట్లు బుక్ చేశారు. ఎయిర్‌పోర్ట్ నుంచి వారి స్వగ్రామానికి చేరుకునేందుకు తెలంగాణ సాధారణ పరిపాలన శాఖ ఏర్పాట్లు చేసింది. తమ బిడ్డలు సురక్షితంగా ఇంటికి చేరుకునేందుకు మంత్రి కేటీఆర్ చేసిన సహాయం మరువలేనిదని వారి కుటుంబ సభ్యులు ప్రశంసిస్తున్నారు.