ఏముంది మొక్క నాటాడు అనుకుంటున్నారా ..అయితే మీరు పప్పులో కాలేశారు .ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట నలబై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు.
ఈ క్రమంలో పోయిన సవంత్సరం నవంబర్ నెలలో ఆరో తారీఖున వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయ నుండి ప్రారంభమైన జగన్ పాదయత్ర కృష్ణా జిల్లాలోని గణపవరం గ్రామంలో పద్దెనిమిది వందల కిలోమీటర్లకు చేరుకుంది.ప్రతి వంద కిలోమీటర్లకు మొక్కను నాటుతూ వస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా మొక్కను నాటాడు.
అయితే గణపవరంలో పాదయాత్ర పద్దెనిమిది వందల కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా గ్రామంలో ఉన్న తన మేనమామ కుమార కోటిరెడ్డి ఇంటికి వెళ్లి బంధువులతో కాసేపు గడిపారు.ఈ సందర్భంగా తన మేనమామ కుటుంబ సభ్యులు జగన్ ఆరోగ్యం గురించి ,పాదయాత్రలో జగన్ పడుతున్న కష్టాన్ని తెలుసుకొని ..తగిన జాగ్రత్తలు సలహాలు చెప్పారు.అయితే చాలా రోజుల తర్వాత జగన్ తమ ఇంటికి రావడంతో బంధువులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బి అయ్యారు ..