సబ్బండ వర్గాల అభివృద్ధి లక్ష్యంగా, సంక్షేమమే ప్రాధాన్యంగా ముందుకు సాగుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న దాదాపు 60,000 మంది జీవితాలను మార్చే నిర్ణయం తీసుకున్నారు. బోదకాల వ్యాధితో భాదపడుతూ జీవనభృతి కోల్పోయిన వారికీ నెల నెల జీవనభృతి అందిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్రం బోధకాల వ్యాధిగ్రస్తులకు జీవనభృతి అందించడానికి తగు చర్యలు చేపట్టడం గమనార్హం.
see also : గొప్ప ఔదార్యాన్ని చాటుకున్న వైసీపీ ఎమ్మెల్సీ ..!
బోదకాల సమస్యను అధ్యయనం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ వీరికి సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఖమ్మం, ఆదిలాబాదు జిల్లాలో సర్వే నిర్వహించి వ్యాధి ఉన్నవారికి సరైన వైద్య సహాయం రాష్ట్రప్రభుత్వం తరపున అందించి, MDA కొరకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడమైనది. జిల్లా అధికారులతో కలిసి ప్రత్యకంగా అసిఫాబాదు , ఖమ్మం జిల్లాలో వ్యాధిగ్రస్తులను పరిశీలించి వైద్యసేవలనందించడానికి నిర్ణయం తీసుకోవడమైనది. దీనికొరకు కావాల్సిన బడ్జెట్ కూడా కేటాయించారు. దీంతో 60,000 మంది జీవితాల్లో కొత్త వెలుగులు విరబూయనున్నాయి.
see also : శ్రీరెడ్డి వెనక వైసీపీ ఉందా -అంబటి రాంబాబు క్లారిటీ ..!
ఫైలేరియా వ్యాధి వివరాలివి
ఫైలేరియా జబ్బు – దోమకాటు ద్వారా వ్యాపించుతుంది.Wucharareia Bonchrafti అనే పరాన్నజీవి ( parasite ) శోషరస నాళాలలో (Lymphatic vessels) లో పెరిగి వాటిని నష్ట పర్చడం ద్వారా శరీరంలోని వివిధ భాగాలలో వాపును కలుగజేస్తుంది.
వాపు వల్ల – బోదకాలు(elephantiasis ), బుడ్డ ( Hydrocele ) వంటి వ్యాది లక్షణాలు వస్తాయి. దీర్ఘకాలికంగా ఉండే ఈ వ్యాది లక్షణాల వల్ల మరణాలు సంభవించవు కానీ చాలావరకు శరీర ఆకృతిలో మార్పు రావడం వల్ల వికలాంగులుగా మారడం, పని కోల్పోవడం , సమాజం లో ఒక కళంకం తో బతుకడం వంటి కారణాల వల్ల వీరందరూ పూర్తి పేదరికం లోకి నెట్టివేయడం జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 52 దేశాలలోని 85 కోట్ల ప్రజలకు ఈ వ్యాధి సోకె అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 2000 సంవత్సరం వరకు 12 కోట్ల మందికి వ్యాధి సోకి 4 కోట్ల మంది దీర్ఘకాలిక వ్యాది లక్షణాలతో భాదపడుచున్నారు.