నిత్యం ఏదోఒక ఘటనతో వివాదాల్లో ఉండే ప్రస్తుత అధికార టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనికి మరో షాక్ తగిలింది.నిన్న నూజివీడు బస్ డిపో నుండి అర్టీసీ బస్సు హనుమాన్ జంక్షన్ మీదిగా గుడివాడకు వెళ్ళుతున్న సమయంలో ఆ బస్సు పై అతికించిన ప్రభుత్వ పోస్టర్లో సీఎం చంద్రబాబు ఫోటో కొంచెం చిరిగి ఉండటంతో ఆ బస్సును చింతమనేని ఆపి.. డ్రైవర్‌ను, కండక్టర్‌ను కిందికి దించి.. నడిరోడ్డుపైనే బండ బూతులు తిట్టారు .ఈ క్రమంలో ఎమ్మెల్యే చింతమనేని తమపై దాడి చేశారని అర్టీసీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు .
అయితే ఈ విషయం కాస్తా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి రావడంతో..ఎమ్మెల్యే చింతమనేని పై ముఖ్యమంత్రి మండిపడ్డారు.ఆర్టీసీ సిబ్బందితో పాటూ స్థానికులపై మండిపడటం, దాడి చేయడాన్ని తప్పుబట్టారట. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే ఊరుకునేది లేదని చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట … రేపు వచ్చి తనను కలవాలని ప్రభాకర్‌ను ఆదేశించారట.దీంతో ఎమ్మెల్యే చింతమనేని పై చంద్రబాబు సీరియస్ గా ఉన్నారని సమాచారం.