అనంతలో ఆట మొదలైంది.. వైసీపీలోకి ఆ ఇద్దరు..!! అవును, అనంతపురం టీడీపీకి చెందిన ఇద్దరు నాయకులు వైసీపీలో చేరనున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే వైసీపీ నేతలతో మంతనాలు కూడా జరిపారు. అయితే, ఇటీవల కాలంలో వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో వైసీపీపై ప్రజల్లో ఆదరణ పెరుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, జగన్ తన పాదయాత్రలో భాగంగా టీడీపీ అవినీతి పాలనను ఎండగడుతూ.. ప్రత్యేక హోదపై ప్రజలను చైతన్య పరుస్తూ.. ప్రత్యేక హోదాపై జగన్ నిత్యం పోరాడుతున్న విషయం తెలిసిందే. జగన్ చేస్తున్న పోరాటంపై ఏపీ మేధావుల సంఘం ప్రశంసల వర్షం కురిపించడమే కాకుండా.. మీ పోరాటంలో మేము కూడా భాగమవుతామంటూ.. జగన్తో చేతులు కలిపారు.
see also : ఏపీలో మరో అది పెద్ద కుంభకోణానికి తెరలేపిన చంద్రబాబు..!!
ఇక అసలు విషయానికొస్తే.. ఇటీవల కాలంలో అనంతపురం జిల్లాలో టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు జోరందుకున్న విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలోనే టీడీపీ నేతగా ఉన్న లింగాల రమేష్ దాదాపు 200 మంది టీడీపీ కార్యకర్తలతో కలిసి వైసీపీలో చేరిన విషయం మరువక ముందే.. తాజాగా దివంగత ఎమ్మెల్యే నారాయణరెడ్డి వారసులు ప్రతాప రెడ్డి, వెంకట నారాయణరెడ్డి కూడా వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే, సోషల్ మీడియాలో వెలువడుతున్న ఈ కథనికి కారణాలు లేకపోలేదు. అనంత టీడీపీలో అంతర్గత విభేదాలు చోటుచేసుకోవడంతోపాటు.. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ టీడీపీని బజారు పాలు చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యే ప్రభాకర్, ఎంపీ జేసీ వర్గానికి చెందిన కార్పొరేటర్లు ఒకరిపై మరొకరు బాహాబాహీనికి దిగిన విషయం తెలిసిందే. ఇలా అనంత టీడీపీలో విభేధాలు తలెత్తడంతో ఇమడలేని ప్రతాపరెడ్డి, వెంకట నారాయణరెడ్డిలు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.