ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా ద్రోహులు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో చంద్రబాబాబు రెండు నాల్కుల ధోరణి అవలంభించిన విషయం తెలిసి కూడా పవన్ కల్యాణ్ 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చారు. అంతేకాకుండా, నాడు శ్రీ వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యత నాది అని చంద్రబాబు, ప్రత్యేక హోదా ఇవ్వుకుంటే ప్రశ్నించే బాధ్యత నాదంటూ చెప్పిన పవన్ కల్యాణ్ చివరకు ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తరువాగ ఏపీ ప్రజలను నట్టేట ముంచారంటూ ఓ 60 ఏళ్ల వృద్ధుడు సోషల్ మీడియా వేదికగా.. పవన్ కల్యాణ్, చంద్రబాబులను ఏకి పారేశాడు.
ఇంకా ఆ సామాన్య వృద్ధుడు మాట్లాడుతూ.. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి చిరంజీవి.. టీడీపీతో పొత్తుపెట్టుకుని పవన్ కల్యాణ్ ఏపీ ప్రజలను మోసం చేశారని, అటువంటి వ్యక్తులు 2019 ఎన్నికల్లో మళ్లీ పోస్తే ఏపీ ప్రజలు నమ్మరన్నారు. పోలవరం, పట్టిసీమ, పురుషోత్తమపట్నం ప్రాజెక్టుల నిర్మాణంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఒక పక్క పత్రికలు ఆధారాలతో సహా కోడై కూస్తున్నా.. చంద్రబాబు అవినీతిపై ప్రశ్నించకుండా పవన్ కల్యాన్ నిమ్మకు నీరెత్తినట్లు ఉంటావా..? అంటూ ప్రశ్నించారు. పవన్ కల్యాణ్.. నీవు అలా ప్రశ్నించకపోవడంతో.. చంద్రబాబు వద్ద నీవు ప్యాకేజీ తీసుకున్నావంటూ వస్తున్న కథనాలకు బలం చేకూరిందని, ఇప్పటికైనా చంద్రబాబు అవినీతిపై బప్రశ్నించి.. నీ చిత్తశుద్ధిని నిరూపించుకో అంటూ పవన్ కల్యాన్‌కు హితవు పలికాడు.