ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుగారి పాలన ఎల్లకాలం సాగదని, రేపటి మీద భరోసా ఇచ్చేందుకు… రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయమే ధ్యేయంగా.. గత ఎడాది నవంబర్ 6న ‘ప్రజా సంకల్పయాత్ర’ పేరుతో ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. గుంటూరు జిల్లాలో ముగిసిన ప్రజా సంకల్పయాత్ర ఈనెల 14 న కృష్ణా జిల్లాలో ప్రవేశించింది. ఇందులో బాగంగానే వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 139వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. బుధవారం ఉదయం ఆయన కృష్ణాజిల్లా మైలవరం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు. వైఎస్ జగన్ అక్కడ నుంచి చిన్న నందిగాం క్రాస్, వెల్వడం, గణపవరం అడ్డరోడ్, గణపవరం మీదగా నూజివీడు నియోజకవర్గంలోని శోభనాపురం క్రాస్ చేరుకుని అక్కడ ప్రజలతో మమేకం అవుతారు. ఇప్పటివరకూ ఆయన 1,794.2 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.
