గత ఎడాది నవంబర్ 6న ‘ప్రజా సంకల్పయాత్ర’పేరుతో ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. గుండెల్లో దమ్ము.. చేతల్లో నిజాయితీ..విశ్వసనీయతే మార్గం .. విలువలే ఊపిరి..ప్రజల చేత.. ప్రజల కోసం.. ప్రతిక్షణం.. పోరాట పర్వం చేస్తున్నారు వైఎస్ జగన్. కొన్ని వేలమంది జగన్ తో కలసి అడుగులో అడుగు వేస్తు న్నారు . ఇందులో బాగంగానే జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరో మైలురాయి దాటింది. కృష్ణా జిల్లా గణపవరం వద్ద బుధవారం 1800 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ అక్కడ మొక్కను నాటి, అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. 180 రోజుల పాటు 125 నియోజకవర్గాల్లో 3 వేల కిలోమీటర్ల మేర వైఎస్ జగన్‌పాదయాత్ర సాగనుంది. ఇప్పటివరకూ కడప జిల్లా, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది.
ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం 0 – కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయ (నవంబరు 6, 2017)
100 – కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి సమీపం (నవంబరు 14, 2017)
200 – కర్నూలు జిల్లా, డోన్ నియోజకవర్గం ముద్దవరం (నవంబరు 22, 2017)
300 – కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గం కారుమంచి (నవంబరు 29, 2017)
400 – అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం గుమ్మేపల్లి (డిసెంబర్ 7,2017)
500 – అనంతపురం జిల్లా, ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు (డిసెంబరు 16, 2017)
600 – అనంతపురం జిల్లా, కదిరి నియోజకవర్గం కటారుపల్లి క్రాస్ రోడ్స్ (డిసెంబరు 24, 2017)
700 – చిత్తూరు జిల్లా, పీలేరు నియోజకవర్గం చింతపర్తి శివారు (జనవరి 2, 2018)
800 – చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం నల్లవెంగనపల్లి (జనవరి 11, 2018)
900 – చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం చెర్లోపల్లి హరిజనవాడ (జనవరి 21, 2018)
1000 – శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో పైలాన్ ఆవిష్కరణ (జనవరి 29, 2018)
1100 – నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం, కొరిమెర్ల (ఫిబ్రవరి 7, 2018)
1200 – ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం, రామకృష్ణాపురం (ఫిబ్రవరి 16, 2018)
1300 – ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని నందనమారెళ్ల (ఫిబ్రవరి 25, 2018)
1400 – ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం నాగులపాడు (మార్చి 5, 2018)
1500- గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని ములుకుదూరు(మార్చి 14, 2018)
1600- గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలుదేవర్లపాడు (మార్చి 27, 2018)
1700- గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం సుల్తానాబాద్ (ఏప్రిల్ 7, 2018)
1800- కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం గణపవరం (ఏప్రిల్ 18, 2018)