జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌పై నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. కాగా, ఇవాళ శ్రీరెడ్డి ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ కోట్లు కోట్లు సంపాదించిన సినీ ఇండస్ర్టీ నుంచి వచ్చిన ఒక తెలుగు అమ్మాయి.. సినీ ఇండస్ర్టీలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడితే.. స్పందించిన పవన్ కల్యాణ్ కోర్టుకు, పోలీసు స్టేషన్లకు వెళ్లమంటాడా..? అసలు బుర్రన్న వాడు మాట్లాడే మాటలేనా అవి అంటూ పవన్‌పై శ్రీరెడ్డి ఫైర్ అయింది. అలాగే, నాపై లైంగిక దాడికి పాల్పడిన వారి పేర్లను ఆధారాలతో సహా చెబుతూ.. సహాయం చేమని, పెద్ద హీరో కదా, ప్రజా నాయకుడు కదా అని పవన్ కల్యాణ్‌ని సహాయం అడిగితే.. కోర్టుకు వెళ్లమంటాడా..? అంటూ ప్రశ్నించింది.
తెలుగు రాష్ట్రాలను ఉద్దరిస్తానంటూ జనసేన పార్టీ పెట్టిన నీవు.. ఒక మహిళకు జరిగిన అన్యాయంపై పోరాడలేక పోతున్నావ్.. రేపు రాష్ట్ర సమస్యలపై ఏం పోరాడుతావ్ అంటూ నిలదీసింది. ఒక అమ్మాయి పోరాటానికి యావత్ ప్రపంచం మద్దతు తెలుపుతుంటే.. పవన్ కల్యాన్ మద్దతు తెలపకపోగా.. అవమానించడం ఎంత వరకు సబబని ప్రశ్నించింది.