Home / ANDHRAPRADESH / గ‌న్న‌న‌రం టీడీపీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేనికి భారీ షాక్..!!

గ‌న్న‌న‌రం టీడీపీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేనికి భారీ షాక్..!!

గ‌న్న‌న‌రం టీడీపీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేనికి భారీ షాక్..!! వైసీపీలోకి గ‌న్న‌న‌రం టీడీపీ సీనియ‌ర్ నేత..! డేట్ ఫిక్స్‌..!! అవును, కృష్ణా జిల్లాలో టీడీపీకి మ‌రో ఎదురు దెబ్బ త‌గ‌ల‌నుంది. ఇప్ప‌టికే కృష్ణా జిల్లాలో టీడీపీలో సీనియ‌ర్ నేత‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే, క‌మ్మ సామాజిక వ‌ర్గ నేతగా ఉన్న య‌ల‌మంచిలి ర‌వి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా కృష్ణా జిల్లాకు వ‌చ్చిన ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ కండువా క‌ప్పుకోగా.. మ‌రో టీడీపీ సీనియ‌ర్ నేత వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారంటూ సోష‌ల్ మీడియాలో ఇటీవ‌ల వార్త‌లు వెలువ‌డిన విష‌యం తెలిసిందే.

see also : సూర్యుడుని సైతం ఎదిరించ‌గ‌ల స‌త్తా గ‌ల నాయ‌కుడు జ‌గ‌న్‌..!!

అయితే, జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిన య‌ల‌మంచిలి ర‌వి మాట్లాడుతూ.. ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్‌పై ఆద‌ర‌ణ పెరుగుతోందని, అంతేకాకుండా 2014లో ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధిస్తాన‌ని చెప్పిన సీఎం చంద్ర‌బాబు.. త‌నపై ఉన్న కేసుల‌కు భ‌య‌ప‌డి, కేంద్ర ప్ర‌భుత్వంతో కుమ్మ‌క్కై హోదాను కేంద్ర పెద్ద‌ల వ‌ద్ద తాక‌ట్టు పెట్టిన విష‌యాన్ని గుర్తు చేశారు. అదే విధంగా వైఎస్ జ‌గ‌న్ మాత్రం రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యం నుంచి నేటి వ‌ర‌కు ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఒకే స్టాండ్‌పై ఉంటూ.. కేంద్ర ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నారంటూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

see also  : బాబుకు గ‌ట్టి షాక్‌..!

see also : ఏపీ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం..! వైపీపీలోకి మంత్రి కుటుంబం..!!

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ప్ర‌జ‌ల కోసం చేస్తున్న పోరాటాన్ని చూసిన ప‌లు పార్టీల నేత‌లు 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి రావ‌డం ప‌క్కా అనే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో గ‌న్న‌వ‌రం టీడీపీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ ముఖ్య అనుచ‌రుడుగా.. అలాగే, ఆర్థికంగా స‌హాయ స‌హ‌కారాలు అందిస్తున్న దాస‌రి జై ర‌మేష్ వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇందుకు సంబంధించి కృష్ణా జిల్లా వైసీపీ నేత‌ల‌తో మంత‌నాలు కూడా జ‌రిపార‌ట‌. ఇప్ప‌టికే ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో కృష్ణా జిల్లాలో పాద‌యాత్ర‌ను కొనసాగిస్తున్న జ‌గ‌న్ స‌మ‌క్షంలో త్వ‌ర‌లో వైసీపీ కండువా క‌ప్పుకోనున్నారంటూ సోష‌ల్ మీడియాలో క‌థ‌నాలు కోడై కూస్తున్నాయి.

see also : ఏపీలో ఇంట్లోనే వ్యభిచారం..హైదరాబాద్‌ మసాజ్‌ సెంటర్‌లో వ్యభిచారం..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat