జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నటి శ్రీ రెడ్డి చేసిన అనుచిత వాఖ్యలపై మెగా ఫ్యామిలీ దాడికి దిగింది. పవన్ శ్రీరెడ్డి కి ఉచిత సలహా ఇవ్వడం, దీంతో ఆమె అతనికి ఘాటైన కౌంటర్ ఇవ్వడంతో గొడవ కాస్తా శ్రీరెడ్డి vs మెగా ఫ్యామిలీ అన్నట్లు తయారైంది. అయితే పవన్ పై శ్రీరెడ్డి చేసిన వాఖ్యలపై ఇప్పటికే పవన్ అన్నయ్య నాగబాబు ,వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ స్పందించగా..తాజాగా మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగాపవర్ స్టార్ రాంచరణ్ స్పందిస్తూ..తన పేస్ బుక్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టాడు.
అందరూ కలిసి పని చేసుకుంటూ ఎదగాల్సిన ఒక కుటుంబం లాంటిది మన ఇండస్ట్రీ. మన ఇండస్ట్రీ లో మహిళలలను ఎప్పుడూ అత్యంత గౌరవం తో చూస్తారు. ఏవైనా సమస్యలు ఉన్నా వాటిని న్యాయబద్ధం గా, సంస్కారవంతం గా పరిష్కరించుకోవాలి. అయితే, కొందరి పేర్లు అనవసరం గా లాగి రాద్ధాంతం చేసి పాపులర్ అవ్వాలని చూడటం చవకబారుతనం గా ఉంటుంది.
Posted by Ram Charan on Wednesday, 18 April 2018
‘అందరూ కలిసి పని చేసుకుంటూ ఎదగాల్సిన ఒక కుటుంబం లాంటిది మన ఇండస్ట్రీ. మన ఇండస్ట్రీ లో మహిళలలను ఎప్పుడూ అత్యంత గౌరవం తో చూస్తారు. ఏవైనా సమస్యలు ఉన్నా వాటిని న్యాయబద్ధం గా, సంస్కారవంతం గా పరిష్కరించుకోవాలి. అయితే, కొందరి పేర్లు అనవసరం గా లాగి రాద్ధాంతం చేసి పాపులర్ అవ్వాలని చూడటం చవకబారుతనం గా ఉంటుంది.’ అని రాంచరణ్ ఒక పోస్ట్ చేశాడు . అంతేకాకుండా పవన్ కల్యాణ్ గతంలో అభిమానులను సహనంతో ఉండాలని చెప్పిన ఓ వీడియోనూకూడా పోస్ట్ చేశాడు.