శ్రీరెడ్డి, టాలీవుడ్‌లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, అలా కాకుండా, తెలుగు సినీ ఇండస్ర్టీలో తెలుగు వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వారి జీవనోపాధికి తోడ్పాటునందించాలని డిమాండ్ చేస్తూ సినీ ఇండస్ర్టీపై యుద్ధం చేస్తున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ఆమె పోరాటానికి ఉహించని మద్దతు లభిస్తుంది.అయితే శ్రీ రెడ్డి ఒక్కసారిగా ఇవాళ తన పేస్ బుక్ ఖాతాలో సంచలన పోస్ట్ పెట్టింది.
ఈ జీవితం ఇక చాలు ( enough of the life ) ’ అని పోస్ట్ చేసింది . ఆమె పోస్ట్‌పై చాలా మంది పవన్‌ను సమర్థిస్తూ కామెంట్లు చేశారు.వెంటనే మరో పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి.
‘ ఈ ప్రపంచంలో మొదటిసారి నేను ఒంటరినన్న ఫీలింగ్ కలుగుతోంది. అలా చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు ’ అని పెట్టింది. అయితే ఈ పోస్టులతో శ్రీరెడ్డి ఇక తన పోరాటానికి ఫుల్‌స్టాప్ పెట్టినట్టేనా అనే వార్తలు వినిపిస్తున్నాయి.