గతంలో కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ సర్కారు అప్పటివరకు ఉన్న పాత ఐదు వందలు ,వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసి వాటి ప్లేస్ లో కొత్త ఐదు వందలు ,రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెల్సిందే .అయితే కేంద్ర సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పటివరకు ఏటీఎం లదగ్గర నో క్యాష్ బోర్డులు దర్శనమివ్వడమే కాకుండా ఏకంగా ప్రస్తుతం రెండు వేల రూపాయల నోట్లు కూడా జాడ లేదు.
అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కుంటున్న నగదు కొరతపై అసలు కారణాలు ఏమిటో చెప్పాలని టీఎంసీ ఎంపీ దినేష్ త్రివేది డిమాండ్ చేశారు.అయితే నగదు కొరత వెనక గతంలో తీసుకొచ్చిన సరికొత్త రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేస్తున్నారా అందుకే ఇలా అవి కన్పించకుండా పోతున్నాయా అని ఆయన ప్రశ్నించారు ..