తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుట్రను జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కళ్యాణ్ మొదట్లోనే పసిగట్టారా? బాబు మార్కు ఎత్తుగడలను పసిగట్టడం వల్లే ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం కేటాయించిన సెక్యూరిటీని పవన్ వెనక్కి పంపారు. తనకు కేటాయించిన 2+2 గన్ మెన్ల భద్రతా సిబ్బందిని వెనక్కి పంపారు. నిన్న రాత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.
see also :మరో సంచలన పోస్ట్ పెట్టిన శ్రీ రెడ్డి..!!
ఈ ఏడాది గత మార్చి నెలలో గుంటూరులో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభ నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలని పవన్ పేర్కొనడంతో.. దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం 2+2 గన్‌మెన్ లను కేటాయించింది. ఈ గన్‌మెన్ లను ఏర్పాటు చేసిన నెల తర్వాత పవన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ సెక్యూరిటీని పవన్ వెనక్కి పంపడంపై పలు ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రభుత్వ సెక్యూరిటీని తనపై నిఘా కోసం అధికార పార్టీ వాడుకుంటోందనే అనుమానం పవన్ వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ అంతర్గత విషయాలు, సమావేశాల వివరాలు లీక్ అవుతున్నాయని భావిస్తున్న క్రమంలోనే గన్ మెన్లను వెనక్కి పంపే నిర్ణయం పవన్ తీసుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని నలుగురు గన్ మెన్లకు పవన్ సిబ్బంది తెలియజెప్పి ప్రభుత్వానికి సరెండర్ కావాలని వారికి సూచించింది.
see also :షూ డాక్టర్ కాన్సెప్ట్‌కు.. ఆనంద్ మహీంద్రా ఫిదా..!!
see also :నేడు సీనియర్లతో జగన్ కీలక భేటీ.. కారణం ఇదే..!!
కాగా, అధికారికంగా తనపై జరుగుతున్నకుట్రను, సర్కారు ఎత్తుగడలను పవన్ పసిగట్టి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను పవన్ బహిరంగంగానే వెళ్లడిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడుగా ఆయన తనయుడైన మంత్రి లోకేష్‌పై కూడా పవన్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పవన్‌పై సర్కారు కుట్ర చేస్తోందని జనసేన వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇందులో భాగంగానే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.