జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లపై అతని అన్న, నటుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల కాలంలో పవన్‌కు మహిళలంటే గౌరవం లేదని, మహిళలంటే ఆటబొమ్మలా చూసే వ్యక్తిత్వం పవన్ కల్యాణ్‌ది అంటూ నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే, శ్రీరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై నాగబాబు ఇవాళ స్పందించారు.
see also :నాగబాబుపై సంచలన పోస్ట్ పెట్టిన శ్రీరెడ్డి..
see also : పవన్ మాట్లాడినదాంట్లో తప్పేముంది..నాగబాబు
నాగబాబు మీడియాతో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో ఏదైనా సమస్య ఉంటే పోలీసులను, కోర్టును సంప్రదించాలని శ్రీరెడ్డికి పవన్ కల్యాణ్ సూచించడం తప్పా అంటూ ప్రశ్నించారు. శ్రీరెడ్డి ఆడ పిల్లని, తనను ఏమీ అనొద్దంటూ తన తల్లి తమకు చెప్పడంతోనే.. శ్రీరెడ్డిని వదిలేశామని, లేకుంటేనా..!! అంటూ నాగబాబు శ్రీరెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ కనుక అతని అభిమానులకు ఒక్క పిలుపు ఇస్తే చాలు.. వారందరూ కదిలొస్తారని, శ్రీరెడ్డి అంతు చూస్తారన్నారు నాగబాబు.