సీబీఐ నోటీసు అంటూ ఫేక్ నోటీసులు సృష్టించి కాంగ్రెస్ నేతలు కావాలనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.అసలు సీబీఐ నోటిసులు రాలేదని స్పష్టం చేశారు. జూపల్లి కుమారులు తీసుకున్న బ్యాంకు రుణాలపై సీబీఐ నోటీసులు పంపించిందని సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు.ఇవాళ టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
అప్పు చేసి వ్యాపారం చేయడం తప్పు అవుతుందా అని మంత్రి ప్రశ్నించారు. ప్రుడెన్షియల్ బ్యాంకులో రూ. 6 కోట్ల రుణం తీసుకొని వడ్డీతో సహా చెల్లించామని తెలిపారు. దొంగచాటుగా కాకుండా… చట్టబద్ధంగానే వ్యాపారం చేస్తున్నామన్నారు. తన పిల్లలు ఆయన మీద ఆధారపడకుండా వ్యాపారాలు చేసుకుంటున్నారని మంత్రి తెలిపారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం సహజమని.. తీసుకున్న అప్పుకు వడ్డీతో సహా చెల్లిస్తున్నామని చెప్పారు .