వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది.ప్రస్తుతం పాదయాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది.పాదయాత్ర నేటికి 139వ రోజుకి చేరుకుంది.ఈ క్రమంలో జగన్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు.పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, సీనియర్ నేతలతో జగన్ ఈరోజు సాయంత్రం సమావేశం కానున్నారు. ఇప్పటికే వైసీపీ సీనియర్ నేతలు, పార్లమెంటు సభ్యులు విజయవాడకు చేరుకున్నారు. అక్కడి నుంచి జగన్ పాదయాత్ర వద్దకు వెళ్లి కలవనున్నారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం.
అయితే ఇప్పటికే వైసీపీ ఎంపీలు ఐదుగురు రాజీనామాలు చేసిన తర్వాత ఆమరణ దీక్ష చేసి ఆసుపత్రిలో చికిత్ప పొంది మంగళవారం రాష్ట్ర పతి రామ్ నాధ్ కోవింద్ ను కలిసి రాష్ట్రంలో జరగుతున్న పరిస్థితులను వివరించారు.రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఏపీ కి మోడీ సర్కారు సహాయం చెయ్యడం లేదని వారు ఫిర్యాదు చేశారు. తమ రాజీనామాలకు దారితీసిన పరిస్థితులను కూడా వారు రాష్ట్రపతికి వివరించారు.
రాష్ట్రపతిని కలిసిన అనంతరం వారు నేరుగా ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరి వచ్చారు.అయితే రాష్ట్రంలో అధికార టీడీపీ పార్టీ నేతలు రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలపై ఇదంతా డ్రామా అంటూ మండిపడుతున్నారు.ఈ క్రమంలో రాజీనామాలు డ్రామాలుగా మిగిలిపోకుండా ఉండాలంటే, వాటిని ఆమోదించుకుని ఎన్నికలకు వెళ్లడమే మంచిదని ఎంపీలు భావిస్తున్నారు..ఈ నేపధ్యంలో ఇవాళ జగన్ తో భేటీ అయిన తర్వాత ఢిల్లీకి వెళ్లి స్పీకర్ ను మరోసారి కలవాలని ఎంపీలు భావిస్తున్నారు. ఇదే సమావేశంలో ఎమ్మెల్యేల రాజీనామాలపై కూడా జగన్ సీనియర్ నేతలతో చర్చించే అవకాశముంది.