దేశంలో ఎక్కడ చూసిన విచ్చలవిడిగా వ‌్యభిచారం జరుగుతుంది. ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాల్లో మరి దారుణం బహిరంగంగానే వ్యభిచారం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని నాచారం ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన మసాజ్ సెంటర్‌లో కొంతమంది యువతులతో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ సమాచారం అందగా ఎస్‌వోటీ పోలీసులు దానిపై దాడి చేశారు. ముగ్గురు యువతులు, ఇద్దరు నిర్వాహకులు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకుని నాచారం పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.
ఏపీలో ఇంట్లోనే వ్యభిచారం..
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ముఠాను టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. విద్యుత్ నగర్ ఒకటో వీధిలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో ఎస్సై మహ్మద్ ఉమర్ బృందం సోమవారం సాయంత్రం ఆ ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో నిర్వాహకురాలు పెనుమర్తి రమాదేవితో పాటు ఇద్దరు యువతులు, ఇద్దరు విటులు పట్టుబడినట్లు ఎస్సై ఉమర్ తెలిపారు. మరెక్కడైనా వ్యభిచార కార్యకలాపాలను ఈ ముఠా నిర్వహిస్తుందోమో నని రమాదేవిని విచారిస్తున్నట్లు ఉమర్ వెల్లడించారు.
