కాంట్రాక్టు లెక్చరర్లకు గుడ్ న్యూస్..! అవును.. కాంట్రాక్టు లెక్చరర్లకు టీ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ఏప్రిల్ నెల నుంచి యూనివర్శిటీ కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు దాదాపు 75 శాతం వేతనాలు పెరిగే అవకాశాలున్నాయి. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇవాళ దీనికి సంబంధించిన జీవోను విడుదల చేశారు. ఆ జీవోను మంత్రి కడియం కాంట్రాక్టు ఉద్యోగులకు అందజేశారు. జీతాలు పెంచుతూ జారీ చేసిన జీవోను అందుకున్న కాంట్రాక్టు లెక్చరర్లు ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మొత్తం 11 వర్శిటీల్లో సుమారు 1,561 మంది కాంట్రాక్టు లెక్చరర్లకు ఈ జీవో ద్వారా మేలు జరగనున్నది.
