జమ్మూ కాశ్మీర్ లోని కథువా లో ఎనిమిదేళ్ళ పాపపై అతికిరాతకంగా అత్యాచారానికి తెగబడి ఆపై దారుణంగా కొట్టి చంపిన సంఘటన యావత్తు దేశ ప్రజలను తీవ్ర కలత చెందేలా చేసింది.అయితే కథువా సంఘటనలో అత్యుత్సాహం ప్రదర్శించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు దేశ రాజధాని మహానగరం ఢిల్లీ హైకోర్టు దిమ్మతిరిగి బొమ్మ కనపడేలా షాకిచ్చింది.
ఈ క్రమంలో కథువా సంఘటనలో బాధితురాలు పేరును బహిరంగపరిచిన మీడియా సంస్థలపై ఢిల్లీ హైకోర్టు కొరడా రులిపించింది.బాధితురాలి పేరును బహిరంగపరిచిన కారణంతో మీడియా సంస్థలన్నీ రూ.పదిలక్షల చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించింది .
అయితే ఈ మొత్తాన్ని బాధితురాలి కుటుంబానికి అందేలా పరిహారం నిధిలో జమచేయాలని న్యాయస్థానం తెలిపింది. ఇక నుండి అత్యాచార బాధితుల పేర్లను వెల్లడించినవారికి ఆరు నెలల జైలు శిక్ష విధించాలని హైకోర్టు ప్రకటించింది ..