ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి జుట్టు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ చేతిలో ఉందా ..అందుకే ఆ పార్టీకి చెందిన కింది స్థాయి నేత నుండి ఏకంగా ఆ పార్టీ అధ్యక్షుడు వరకు అందరూ కర్ణాటక సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు కృషి చేస్తూ ..బీజేపీ పార్టీ ఓటమికి కష్టపడుతున్నారా అని అంటే అవుననే అంటున్నారు రాజకీయ వర్గాలు.మంగళవారం ఉదయం బెంగళూరు-అనంతపురం రహదారిపై పోలీసులు చేసిన తనిఖీలో దాదాపు నూట ఇరవై కోట్ల విలువ చేసే నగదు దొరికిన సంగతి తెల్సిందే.
అయితే ఈ మొత్తాన్ని ఏపీలోని అనంతపురం జిల్లా నుండి వస్తున్నా క్రమంలో పట్టుబడటంపై ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ,సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అందులో భాగంగా కేంద్రం తమ దగ్గర ఉన్న ఇంటిల్ జెన్స్ వర్గాల ద్వారా ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి పరోక్షంగా నోట్ల కట్టలను పంపిస్తున్నారు అనే విషయాన్నీ పసిగట్టింది అంట .
దీంతో రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని దారుణాలకు పాల్పడతారో ఎప్పటికప్పుడు ఇంటిల్ జెన్స్ వర్గాల ద్వారా సమాచారాన్ని సేకరించి పక్కా ఆధారాలను సేకరించి త్వరలోనే సీబీఐ ద్వారా కర్ణాటక రాష్ట్ర ఎన్నికల్లో టీడీపీ అక్రమాలను ,ఏపీలో గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్న పలు అవినీతి అక్రమాలపై విచారణ చేయించి బాబును జైలుకు పంపడం ఖాయమంటున్నారు విశ్లేషకులు .అందుకే బాబు జుట్టు కేంద్రం చేతిలో ఉందని సెటైర్లు వేస్తున్నారు ..