సాధారణంగా అందరూ పని చేస్తారు..కాని ఒక లక్ష్యన్ని ఎంచుకొని దానికి తగ్గటుగా పనిచేసిన వారే జీవితంలో విజయం సాధిస్తారు.గొప్ప పేరు సంపాదించుకొని లైఫ్ లో సెటిల్ అవుతారు.అందుకు ప్రత్యేక్ష సాక్షమే ఈ వార్త..తెగిన చెప్పులు, చిరిగిన షూలు కుట్టుకునే ఓ చిరువ్యాపారి.. తనకున్న కొంత ఆర్ధిక స్థోమతలో తన వ్యాపారాన్ని ప్రచారం చేస్తున్న తీరు అందర్నీ ఆకట్టుకుంటున్నది. గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ వ్యాపారి వినూత్న ప్రకటన .. ఆనంద్ మహీంద్రా ను ఆశ్చర్యపరిచింది..అదికాస్తా ఇప్పుడు వైరల్‌గా మారింది.
అసలు ఫ్లెక్సీలో ఏముందంటే…
‘గాయపడిన బూట్ల ఆస్పత్రి. డాక్టర్. నర్సీరామ్.
ఓపీడీ సమయం: ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు
భోజన విరామం: మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఆస్పత్రి తెరిచి ఉంటుంది
అన్ని రకాల బూట్లకు జర్మన్ టెక్నాలజీతో చికిత్స చేయబడును..
అయితే ఈ ఫొటో … ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాకు వాట్సాప్ లో వచ్చింది.ఆ ఫోటోను చూసి అయన ఫిదా అయ్యారు. కొత్త ఆలోచనలను ప్రోత్సహించే ఆనంద్.. ఈ చర్మకారుడి వివరాలు తెలపాలని ట్విట్టర్ ద్వారా నెటిజన్లను కోరాడు. అతనితో కలసి పెట్టుబడి పెట్టి దుకాణం పెట్టాలని ఉందన్నాడు. దుకాణం, ఇతర అవసరమైన వస్తువులు లేకుండానే కేవలం ప్రచారాస్త్రంతోనే ఆకట్టుకుంటున్న ఇతనికి సాయం చేయాలని ఆనంద్ ఉద్దేశం. దీన్ని గమనించిన కొందరు డాక్టర్ నస్సీరాం హరియాణాలో జింద్ లో ఉంటున్నాడని, గతంలో పత్రికల్లో ఆయనపై కథనాలు చాలా వచ్చాయని తెలిపారు.
This man should be teaching marketing at the Indian Institute of Management… pic.twitter.com/N70F0ZAnLP
— anand mahindra (@anandmahindra) April 17, 2018
Got it on whatsapp. No clue who or where he is or how old this pic is. If anyone can find him and he’s still doing this work I’d like to make a small investment in his ‘startup’. https://t.co/A8kdJTvAN1
— anand mahindra (@anandmahindra) April 17, 2018